Sunday, March 29, 2015

ధర్మసందేహాలు...

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.
5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది. 
9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.
13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. 
17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.
21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.
25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.
27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.
29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.
30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.
31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.
32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.
33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.
34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.
35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.
37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.
38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.
39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.
40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.
41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.
43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.
45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.
46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.
47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.
48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు.
49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.
50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు.
51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.
52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.
53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.
56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.
58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.
61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.
62. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
64. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.
65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.
66. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.
67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.
68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.
69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.
70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.
71. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.
72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.
73. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిన మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.
74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.
75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.
76. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.
77. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.
78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.
79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
81. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.
82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.
83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.
85. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.
86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.
87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
89. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
90. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.
91. దిగంబరంగా నిద్రపోరాదు.
92. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
93. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.
94. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.
95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
96. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
97. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.
98. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.
99. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.
100. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి, లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.
 
101. బాలుడైనా, పురాణవేత్త పూజ్యుడే. పౌరాణికునికి పాదనమస్కారం చేసి తీరాలి.
102. విప్రుడి సొమ్ము విషం కంటే ప్రమాదం. దానిని పొరపాటున కూడా స్వీకరించరాదు.
103. విప్రస్త్రీని వివాహమాడిన అన్య పురుషుడు పొందే పాపాన్ని సకలనదులు, తీర్థాలు కూడా తొలిగించలేవు. సమర్థుడైన గురువును ఆశ్రయించి ఈ పాపం తొలిగించుకొనకపోతే అధోగతుల పాలౌతారు.
104. అతిథులకు పాడైపోయిన పదార్థాలు పొరపాటున కూడా పెట్టరాదు.
105. ఇల్లు పట్టించుకోకుండా రోజంతా వీధులలో తిరిగే ఇల్లాలిముఖం చుస్తే గోహత్యా పాతకం చుట్టుకుంటుంది.
106. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.
107. వింధ్యాచల ప్రయాగ, కురుక్షేత్రం, శ్రీశైలం, కాశి, కాళహస్తి వంటి క్షేత్రాలలో బంగారం దానం చేస్తే నరకదర్శనం కాకుండా స్వర్గానికి పోవచ్చును.
108. గురువు కంటే ముందుగా యాత్రలలో నడచుట దోషం.
109. దీపారాధనకు కంపుకొట్టే నూనెను వాడరాదు. దారిద్ర్యహేతువు, మంచినూనె, నేయి మాత్రమే వాడాలి.
110. వేయి శాస్త్రాలు, నిగమాగమాలు చదివినవాని కంటే ఒక్క బాగవతం సంపూర్ణంగా చదివినవాడు గొప్పవాడు. భాగవత పండితునకు అగ్రపూజ చేయాలి.
111. నిత్యం తామువాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం, కనుక ఆకులలోకాని, క్రొత్త పాత్రలలోకాని వారికి ఆహారం పెట్టాలి.
112. జపమాల మెడలో వేసుకొనరాదు. మెడలో వేసుకొన్న మాలతో జపం చేయరాదు.
113. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కాని, లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కాని చేయాలి.
114. తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు.
115. గోవులను, విప్రులను కాలితో తన్నరాదు.
116. సూర్యునకు ఎదురుగా, గోబ్రాహ్మణులకు ఎదురుగాను మూత్ర విసర్జన చేయరాదు.
117. పురాణం చెప్పే వారికన్నా, వినేవారు ఎత్తులో కూర్చోరాదు. అనారోగ్యం ఉన్నవారు కుర్చీలలో కూర్చొనుట దోషం కాదు.
118. వికలాంగులను వేళాకోళం చేయరాదు.
119. శిష్యులలో కొందరిపై పక్షపాతం చూపే ఉపాచ్యాయులు గురుద్రోహుల కంటే భయంకరులు. అటువంటి అధ్యాపకులను తక్షణం వదిలిపెట్టేయాలని యముడు చెప్పాడు. 
120. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు.
121. ఏడవటం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి.
122. ప్రమాదవశులై మరణించిన వారికి పిశాచ జన్మ వస్తుంది. వారి విముక్తికి భాగవత సప్తాహం మాత్రమే మార్గం.
123. భోజనాలలో పంక్తి దోషం(అనగా ఒకరికి కొన్ని వడ్డించి మరికొందరికి పక్షపాతంతో వాటిని వడ్డించక పోవుట) పనికిరాదు.
124. అతిథులకు విస్తరాకులు, అరటిఆకులు, వెండి పాత్రలలోనే భోజనం పెట్టాలి.
125. తన మతాన్ని వీడి, అన్య మతాలను స్వీకరించే వాడు తల్లిని పొందిన ఘోర పాపం పొందుతాడు.
126. పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే.
127. శ్రాద్దంలో భోక్తలుగా వికలాంగులు, మతిలేనివారు, పళ్ళు పుచ్చిపోయి నల్లగా అయిపోయినవారు, రోగులు పనికిరారు.
128. శ్రాద్దము పెట్టినవారు, భోక్తలు కూడా ఆ రాత్రి భోజనం చేయుట, రాతిలో పాల్గొనుట చేయరాదు.
129. ఏదైనా తిన్నాక కాని, మధ్యాహ్నం దాటాక కాని క్షౌరకర్మలు పనికిరావు. దహన కర్మాదులు చేస్తే ఈ నియమం వర్తించదు.
130. అతిథులకు భోజనం పెట్టేటపుడు ఒక్క శ్రాద్ధ కాలంలో తప్ప తక్కిన వేళల పాయసం, గారెలు ఒకేరోజు వండి పెట్టరాదు.
131. కలియుగంలో పురాణం వినటం కంటే జీవులకు మరొక ధర్మం లేదు, కనుక నిత్యం ఏదో విధంగా పురాణాలు వినాలి.
132. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు.
133. గురువుతో మాట్లాడేటపుడు నోటికి చేతిని అడ్డం పెట్టుకుని మాట్లాడాలి.
134. దానమిచ్చిన వస్తువుని ఎట్టిపరిస్థితులలోనూ వెనుకకు తీసుకోరాదు. తప్పనిసరి పరిస్థితులలో తీసుకోవలసి వస్తే డబ్బిచ్చి కొనుక్కోవాలి.
135. పెద్దన్న గారు, పిల్లనిచ్చిన మామ గారు, గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి.
136. మగపిల్లల పేర్లలో అక్షరాలు సరి సఖ్యలోనూ, ఆడపిల్లల పేర్లలోని అక్షరాలు బేసి సంఖ్యల్లోనూ ఉండాలి.
137. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా, తడి కాళ్ళతో భోజనం చేయరాదు.
138. కట్టి విడిచిన దుస్తులు మళ్ళీ ధరించరాదు. వాటిని ఉతికిన తరువాతే వేసుకోవాలి.
139. సూర్యోదయ, సుర్యాస్త సమయాలను సంధ్యావందనం చేయకుండా చూడరాదు.
140. నిద్రనుండి మెలుకువ వచ్చాక ప్రక్కమీద దొర్లుతూ పడుకొని ఉండరాదు.
141. మొలతాడు లేకుండా ఆచమనం, శౌచ విధులు, దేవపూజ పురుషులు చేయరాదు.
142. స్నానం చేశాక వంటిని తడి లేకుండా పూర్తిగా తుడుచుకోవాలి. సరిగా తుడుచుకోకుండా తడితోనే వస్త్రాలు ధరించేవాడు దరిద్రుడు అవుతాడు.
143. శరీరాన్ని రుద్దుకోకుండా, సరిగా స్నానం చేయకుండా, సగం సగం స్నానం చేయడం మహా దోషం. శరీరాన్ని పరిశుభ్రంగా చేసుకుంటూ స్నానం చేయనివారు పందులుగా పుడతారు.
144. దీపారాధన చేశాక అందులో అగరవత్తులు, హారతి మున్నగునవి గృహస్తులు వెలిగించరాదు. పీఠాలు, ఆలయాలకు ఈ నియమం వర్తించదు.
145. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.
146. లాగులు ధరించి పూజ చేయరాదు(లాగు అనగా నిక్కరు,డ్రాయరు ఇవి పూజ చేసేటపుడు నిషేధాలు. ఇది పెద్దవారికి మాత్రమే, పిల్లలకి వర్తించదు).
147. శిష్యుని ఉన్నతిని, కీర్తిని, గౌరవాన్ని సహించలేని అధ్యాపకుడు సర్వ నాశానమైపోతాడు. కనుక శిష్యులు పైకి వస్తే వారిపై ఈర్ష్య పొందరాదు.
148. రేపు చేయవలసిన పనిని ఈ రోజు, ఈ రోజుపని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు.
149. వయస్సులో పెద్దవారి కంటే, విద్యలో పెద్దవారికి ముందుగా పూజ చేయాలి.
150. ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు.
151. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం.
 
152. చెట్లమీద ఎక్కి మలమూత్ర విసర్జన చేయరాదు.
153. నదికి వరదలు వచ్చినపుడు స్నానాలు పనికిరావు.
154. బయట ఉన్న స్త్రీలు నదీ స్నానం చేయరాదు, దేవాలయాలకు వెళ్ళరాదు, పొయ్యి వెలిగించరాదు. ఈ మూడు ఘోర పాపాలే.
155. మలమూత్ర విసర్జన చేసిన చెంబుతో నీళ్ళు తీసుకొని, కాళ్ళు కడుగుకోకుండా నదిలోనికి స్నానానికి దిగరాదు. మలవిసర్జనానంతరం నీళ్ళు విడిగా తీసుకొని మాత్రమే మలద్వారాన్ని కడుక్కోవాలి. సరాసరి నదిలో కడుగరాదు, ఇవి రోగజన్మలకు కారణమవుతాయి.
156. శిష్యుడు పక్కన ఉండి కూడా గురువు తన బరువులు తానే మోసుకొనుట తప్పు. ఈ తప్పుకు శిష్యుడు గురుసేవ ఒక వారం పాటు చేసి ప్రాయశ్చిత్తం చేసుకొనవలెను.
157. కాలి మీద కాలి వేసుకొని రుద్దుకొనుచూ కాళ్ళు కడుగరాదు.
158. కంచు పాత్రలో కాళ్ళు, చేతులు కడుగుకొనరాదు.
159. ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక, వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు.
160. కాళ్ళతో ఆసనాలు లాగరాదు(చాపలు, కుర్చీలు మొదలైనవి).
161. గోళ్ళతో అనవసరంగా గడ్డిపరకలు తుంచుట, కాలక్షేపానికి నోట్లో పెట్టుకొని వాటిని ఉమ్మివేయరాదు.
162. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ వేసికొనుట చేయరాదు.
163. విశిష్ట వ్యక్తులను, మహాత్ములను అగౌరవపరచి, నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు.
164. నగ్నావస్థలో చదువుట, నడచుట పనికిరావు.
165. సరిగా ముఖం కడుగుకొనని, దంతధావనం చేయనివాడు దైవద్రోహి అవుతాడు.
166. ఎంగిలితో ఉన్నపుడు దేవవిగ్రహాలు తాకరాదు.
167. ఏ పరిస్థితులలోనూ రావి చెట్టుని నరకరాదు.
168. ఎముకలపై, పుర్రెపైన, భాస్మంపైన, ముళ్ళమీద, ఊకపైన, బొగ్గులపైన, పిదకలపైన కూర్చోకూడదు.
169. పశు పక్షులను, సర్పాలను, పరస్పర యుద్దాలకు పురిగొల్పరాదు(కోడి పందాలు, గొర్రె, పొట్టేళ్ల మధ్య యుద్దాలు మొదలైనవి).
170. అగ్ని మధ్య నుండి, గోవుల మధ్య నుండి, బ్రాహ్మణుల మధ్య నుండి వెళ్ళకూడదు. అనగా అటూ ఇటూ నిప్పు ఉన్నపుడు ఆ రెండిటి మధ్య నుండి వెళ్ళరాదు.
171. విరిగిన మంచం మీద, ఎవరూ లేని పాత ఇంటిలోనూ, ఎదురు మంచం మీద, మోదుగ మంచం మీద పడుకొని నిద్రపోరాదు.
172. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు.
173. స్నానం చేయగా మిగిలిన నీరు బక్కెట్టులో నుండి వెంటనే పారబోయాలి. అది ఇతరులు వాడితే ఆ పాపం మిగిల్చిన వారికే పట్టుకుంటుంది.
174. బట్ట తడిపిన నీటితో కాళ్ళు కడుగుట, స్నానం చేయుట పనికిరావు.
175. మనుష్యుని పాపం వాడి అన్నం లోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.
176. కుక్క ముట్టిన అన్నం, మళ్ళీ వేడి చేసిన అన్నం, చండాలుడు చూచిన అన్నం, పురుగులు పడిన అన్నం, కుష్ఠువ్యాధి కలవారు తాకిన అన్నం, స్నానం చేయని వారు పెట్టిన అన్నం తినరాదు. 
177. చూలు ధరించిన ఆవు పాలు తాగరాదు. 
178. జపసమయంలో మాట్లాడరాదు. మధ్యలో మాట్లాడితే ఆచమనం చేసి, మళ్ళీ జపం మొదలుపెట్టాలి.
179. ప్రదక్షిణలు చేసేటపుడు, మంత్ర పుష్పం ఇచ్చేటపుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు. ఇవి మహా పాపాలు.
180. అన్నమును తింటున్నపుడు ఆ అన్నమును దూషించుట కాని, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుటకాని చేయరాదు.
181. గ్రహణ సమయంలో భోజనం పనికిరాదు. గ్రహణం అయిన తరువాత తలకు స్నానం చేయకుండా భోజనం చేయరాదు.
182. భోజనసమయంలో వేదములు చదువుట, గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు. ఏడుస్తూ అన్నం తినరాదు.
183. శ్రాద్ధకర్మలలో పెండలము, దోస, పిప్పలి, వక్క, బూడిద గుమ్మడి, ఆనపకాయ, వంకాయ, ఉల్లిపాయ, బొబ్బట్లు, గేదెపాలు, చుక్కకూర, మిరియాలు, పాలకూర వాడరాదు. ఇవి కేవలం భోక్తలకు మరియు శ్రాద్ధకర్మలు చేయు యజమానులకు మాత్రమే మిగిలిన వారికి వర్తించవు.
184. శ్రాద్దలలోఉండి తీరవలసినవి. 1.నువ్వులు 2.యవధాన్యం 3.గోధుమలు 4.పెసరపప్పు 5.మినుములు 6.ఆవాలు 7.గారెలు 8.పరమాన్నం.
185. శ్రాద్దములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చు.
186. శ్రాద్ధభోక్త మరొక చోట ఏమి తిన్నా భోక్తగా పనికిరాడు. ఇతరుల ఆహ్వానంపై ఆ రోజు ఎక్కడినా ఏమైనా స్వీకరించిన శ్రాద్దభోక్త, శ్రాద్ధం పెట్టించిన పురోహితుడు, ఘోర నరకాలు పొందుతారు.
187. నిత్య మధ్యపానం చేసేవాడు అలాంటివానితో ఒక సంవత్సరం స్నేహం చేసి వాని వలన సొమ్ము స్వీకరించినవాడు, అటువంటి మద్యపానరతుని స్తుతించినవాడు, వానిని సమర్థించినవాడు వీరంతా మహా పాపులు.
188. నెలకొకసారి మంత్రోపదేశం చేసిన గురువుగారి ఇంటికి వెళ్లి, స్వయంపాక దక్షిణాదులనిచ్చి సంతృప్తి పరచి పాదపూజ చేసి, ఆశీస్సులు అందుకొను నరుడు నరకానికి పొరపాటున కూడా వెళ్ళడు, ఘోర పాపాలకు కూడా ఇదొక ప్రాయశ్చిత్తం.
189. తరచుగా చెడ్డ కలలు వస్తుంటే సుందరకాండ పారాయణ చేయించుకొనవలెను.
190. తప్పుడు లెక్కలతో వ్యాపారం చేసిన వారికి చండీ సప్తశతి పారాయణతో ఆ పాపం తొలిగిపోతుంది.
191. "పూర్వజన్మకృతం పాపం, వ్యాధి రూపేణ బాధతే" అనగా పూర్వ జన్మలో చేసిన పాపం రోగరూపంలో పీడిస్తుంది. దీనికి తగిన పారాయణ, పూజాదులు ప్రాయశ్చిత్తాలు. ప్రాయశ్చిత్తం జరగనంతకాలం ఈ రోగాలు తగ్గవు.
192. ఎంతకోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చేయి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటివేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవీ తాను తినరాదు.
193. సకల పురాణవేత్త, పురాణవక్త అయిన వాని నమస్కారం అందుకొన్నా, పాదాలకు అటువంటి వారిచేత నమస్కారం పెట్టించుకొన్నా సర్వనాశనమై వేయి జన్మలు ఎత్తి, నరక యాతనలు పొంది అలమటించిపోతారు. ఒక్క పౌరాణిక వేత్తకు మాత్రమే మరొక పౌరాణికుని నమస్కారం అందుకునే అర్హత.
194. అస్పష్టం, అర్థం లేనిది, పెద్దగా ఉన్నది అయిన పేరు పిల్లలకు పెట్టరాదు.
195. నాస్తికునికి, సమాజ మర్యాద తెలియని వాడికి, కృతఘ్నుడికి, మొండి వాడికి, పరుగు పెడుతున్న వాడికి, అపవిత్రుడికి, తలకు నూనె రాసుకొని తలంటుకోబోయే వానికి, జపంలో ఉన్న వానికి, వివాద శీలికి, చండశాసనుడికి, కక్కుంటున్న వాడికి, నీళ్ళలో నిలబడి ఉన్నవాడికి, భిక్షకుడికి, నిద్రపోతున్నవాడికి నమస్కారం చేయరాదు. భర్తను చంపిన స్త్రీకి, బయట ఉన్న స్త్రీకి, గర్బవతికి, గర్బస్రావం చేయించుకొన్నవారికి, భర్తతో పోట్లాడే స్త్రీకి నమస్కారం పెట్టరాదు.
196. వైశాఖ శుక్ల తృతీయ, భాద్రపద కృష్ణ త్రయోదశి, కార్తిక శుక్లనవమి, మాఘ పూర్ణిమలో దానం అక్షయ ఫలితాలనిస్తాయి, ఇవి యుగప్రారంభ తిథులు (సూక్తులు నారద పురాణంలో 25వ అధ్యాయంలో 35 నుండి 65 వరకు శ్లోకాల సారాంశం నుండి ఇవ్వబడింది).
197. దేవాలయాలలో పూజా సమయాలలో గోళ్ళు తీయుట, తెల్ల వెంట్రుకలు పీక్కొనుట నిషేధాలు, ఇవి చాలా పాపాలు.
198. తులసిని తలపై ధరించుట తప్పు.
199. ఏ పరిస్థితులలోనూ తులసిని, బిల్వ పత్రాలను మానవుల పాదాలపై వేసి పాద పూజ చేయరాదు. చివరకు మాతృ, పితృ మూర్తులైనా సరే వారి పాదపూజలకు ఈ రెండు వాడరాదు.
200. కార్తీక మాసంలో దేవాలయంలో దీపారాధనకు నూనెలు వాడరాదు. ఆవు నేయి మాత్రమే వాడాలి. తప్పనిసరి పరిస్థితులలో ఆవునేయి కలిపిన నూనెలు వాడవచ్చు.
 
 
201. పడుకొని తినుట, చదువుట పనికిరాదు.
202. శివాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు.
203. శివాలయానికి ఎదురుగా, విష్ణ్యాలయానికి వెనుక ఇళ్ళు కట్టుకొని కాపురం ఉండరాదు.
204. చీకటిలో(దీపం లేకుండా) దైవాన్ని తాకుట పరమ దోషం.
205. మత్స్య మాంసాదులు తిని దేవాలయంలోకి అడుగు పెట్టుట, దేవ పూజ చేయుట అనే పాపాలకు మాములు ప్రాయశ్చిత్తాలు చాలవు.
206. పరుల వస్త్రములు ధరించి దైవపూజ చేయరాదు.
207. భూమినితాకి దీపం వెలిగించాలి. దీపం వెలిగించాక చేతిని కడుగుకోవాలి.
208. చినిగి పాడైన చీర, రంగు వెలిసిన వస్త్రాలు, మలమూత్రములు ఎత్తుటకు ఉపయోగించిన బట్టలు, పురిటి సమయంలో ధరించిన వస్త్రం, చచ్చిన శవంపై కప్పిన వస్త్రం ధరించరాదు. వీటిని కాటి కాపరికి గానీ, బిచ్చగాళ్ళకు కాని, చెండాలునికి గాని, పారిశుధ్యపు పని వారికి ఇచ్చుట కాని పాతిపెట్టుట కాని చెయ్యవలెను.
209. రాగి పాత్రలలో జలముతో సంధ్యావందనం, నిత్యారాధన చేయుట మంచిది.
210. నోటికి అడ్డముగా గుడ్డ కట్టుకొని మనసులో గురూపదేశం మంత్రమును జపిస్తూ చుట్టూ 3 సార్లు ప్రదిక్షిణ చేసి ఆ తరువాత గురువు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు శిరస్సున జల్లుకొని గురువు రెండు పాదాలూ శుభ్రంగా పొడిగుడ్డతో తుడిచి, పళ్ళెంలో పెట్టి, పూజించి రెండు పాదాలపై తల పెట్టి నమస్కరించిన శిష్యుడు ఏ దోషం చేసినా తొలిగించుకొని స్వర్గం మొదలుకొని తన భక్తిని బట్టి ఊర్థ్వ లోకాలు పొందుతాడు. ఇది 100 భూ ప్రదక్షిణలతో సమానపుణ్యం.
211. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.
212. గ్రహణం పట్టినప్పటినుండి విడిచి పెట్టేలోపు గురూపదేశ మంత్రాన్ని చేయుట మహాఫలితం. ఆ సమయంలో ఒకసారి చేస్తే అది 100 సార్లు చేయడంతో సమానం.
213. విరిగిన పాలు, చిరిగిన చాప, అంచులు విరిగిన కంచాలు వాడుట దోషం.
214. మంత్రోపదేశం చేసిన గురువు ఊళ్ళో ఉండగా ఆయన దర్శనానికి వెళ్లక, ఆయన చేసే పూజలు చూడకుండా దేవీ నవరాత్రుల పూజలు తన ఇంటిలో చేసుకొనుట నిషిద్దం. కనుక దేవీ నవరాత్రులలో నిత్యం గురుదర్శనం చేయుటకాని లేదా గురువు చేసే పూజ చూచుట కాని ఏదో ఒక సమయంలో చేయాలి. అప్పుడే తన దేవీపూజలు ఫలిస్తాయి.
215. ముక్తాం శుక్తిం హరేరర్చాం శివలింగాం శివాం తథా