Sunday, November 20, 2016

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ.
ద్వితియోధ్యాయః
ఓ మునిశ్రేష్టులారా! పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను వినుడు. పూర్వము కాశీ నగరమున ఒక బ్రాహ్మణుడుండేడి వాడు. అతడు మిగుల దరిద్రుడగుటచే అన్నవస్త్రములు లేక ఆకలి భాధపడుచు ప్రతి ఇల్లు తిరుగుచుండెడి వాడు. భగవానుడు బ్రాహ్మణా ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు దుర్భరమైన కష్టమును అనుభవించుట చోఇ తానూ ఒక వ్రుద్ద బ్రాహ్మణ రూపమును పోమ్దినవాడై ఆ బెడ బ్రహ్మనునకు ఎదురుగ పోయి 'ఒఈ బ్రాహ్మణుడా! నీవు వేద విదురుడవై యుండి ఇట్లు దరిద్రముననుభవించుచు తిరుగుచుంటివేమి? అని అడుగగా ప్రభూ నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటన చే జీవించుచున్నాను, చాల కష్టములను అనుభవించుచున్నాను. అతడు బ్రాహ్మణుడా! శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారము. ఆ సత్య దేవుని సేవించినచో నీ కష్టములెల్ల తొలగిపోవును. కనుక నీవు ఆ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరింపుమనెను. వ్రాత విధానమును చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు అచ్చటనే అంతర్ధాన మయ్యెను.వెంటనే ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణవ్రతమును రేపు చేసెదను అని మనసున సంకల్పించి, నాటి రాత్రి ఉత్సాహమున నిదురరాక ఎట్లో గడిపి మరునాడు ప్రాతః కాలమున లేచి నిత్యకృత్యములు నేరవర్చుకొనినవాడై ఈ రోజు తప్పక వ్రతమాచ రించవలెను. మనస్సున దృడముగా నిశ్చయించుకొని బిక్షాటనకు బయలుదేరెను. ఆదినమున బ్రాహ్మణునకు ఎన్నడు రానంత ద్రవ్యము లభించినది. అతడు బంధువులను పిలిచి భక్తీశ్రద్ధలతోసత్యనారాయణ వ్రతమును ఆచరించేను. వ్రత ప్రభావము వలన బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలిగి, సకల సంపదలు పొందిచాల సంతోషించెను. అది మొదలు ప్రతిమాసమునాను విడువక సత్యనారాయణ వ్రతమును భక్తిశ్రద్ధలతో చేయుచుండెను. ఆ విధముగా చేయుట వలన ఆ బ్రాహ్మణుడు మహాదైశ్వర్య వంతుడగుటయేగాక సకల పాపముల నుండి విముక్తుడై అంత్యమున మోక్షమును పొందెను. ఈ వ్రత మాచరించినవారు సకల దుఃఖముల నుండి విముక్తిని పొందినవారై సుఖముగా నుందురు.
ఓ మునులారా! ఆ విధముగా అశ్రీ హరి నారదునకు చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిపితిని. అని సూతులవారు చెప్పిరి. మరల ఆ మునులు వారితో యిట్లనిరి. ఆ బ్రాహ్మణుని వలన యెవరు ఈ వ్రతమును చేసిరో సవిస్తరముగా తెలుపుమనిన సూతులవారు ఇట్లు చెప్పుచున్నారు. ఓ ములారా! ఆ వ్రతము యెవరిచే చేయబడినదో చెప్పుచున్నానని వినుడు. ఒకప్పుడు ఒక ఆబ్రాహ్మణుడు ఈ వ్రతమాచరిం చుచుండెను. భక్తీ శ్రాధాలతో బంధువులు, సర్వజనులు వచ్చి ఆనందముతో వ్రతకథ వినుచుండిరి. ఆ సమయమున ఒకకట్టెలమ్మునాతడు మిగుల అసకలి దప్పులతో నుండియు బ్రాహ్మణుడు చేయుచున్న దంతయు చూచి, ఓ మహాత్మా! మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతము చేసిన ఏమి ఫలితము వచ్చును? దయతో సవివరముగా తెలుపుము అని పార్ధించెను. అపుడు ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు ఓయీ! సత్యనారయణ వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును. సకలైశ్వర్యములు కలుగునని తెలుపగా కట్టెలమ్మువాడు మిగుల సంతసించి దాహము తీసుకొని, ప్రసాదమును గ్రహించి భోజనం చేసిన పిమ్మట యింటికి వెడలిపోయెను.

కట్టెలమ్మునాతడు సత్యనారాయణ వ్రతము చేయుటకు నిశ్చయించుకొని మరునాడు పుల్లల కావడి భుజము పై పెట్టుకొని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి సత్యనారయణ వ్రతము చేసెదను అని సంకల్పించుకొని పట్టనములోనికి బయలుదేరెను. అతడు ఆ దినము ధనవంతులుండు వీధికి పోయి అమ్మగా పూర్వము కంటే రెట్టింపు ధనము వచ్చెను. అతడు మిగుల సంతోషించి అరటిపండ్లు, చెక్కెర, నేయి, పాలు, గోధుమనూక మొదలగునవి తీసుకొని యింటికి చేరెను. తరువాత అతడు తన బంధుమిత్రాదులను ఆహ్వానించి యధావిధిగా సత్యనారాయణ వ్రతము నాచరించెను. అవరత ప్రభావము వలన అతడు ధనమును, పుత్రపుత్రిక్లాను పొంది జీవిత కాలమంతయు సకల సుఖములననుభవించి అంత్యము సత్యలోకమున పోందెను.


No comments:

Post a Comment