Friday, November 18, 2016

ఓం సాయిరాం

శాస్త్రజ్ఞానం, ఆత్మజ్ఞానం ఈ రెండు కలిగియుండుటయే సర్వోత్తమమైన స్థితి. అట్టిస్థితి లేనిపక్షమున శాస్త్రజ్ఞానం మాత్రం కలిగియుండుట కంటే ఆత్మజ్ఞానం కలిగియుండుటే శ్రేష్ఠమైనదిగా పెద్దలు అంతిమంగా నిర్ణయించారు. ఎందుకంటే మోక్షము ఆత్మజ్ఞానం వలన కలుగుతుంది గాని శాస్త్రపఠనం వలన కాదు. ఆత్మజ్ఞానం వలన మోక్షములభించుటలో సందేహంలేదు గానీ కేవలం శాస్త్రజ్ఞానం కలవారికి శాశ్వతానందం లభించుట సందేహమే! అలాగే ఇతరులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దటానికి శాస్త్రజ్ఞానం అవసరం. అలాగే విద్యలేనివారు విద్యావంతులచే పాలింపబడుదురు. అందువలన ప్రతి గురువు తనయందు భక్తి శ్రద్దలున్న శిష్యులకు శాస్త్రజ్ఞానం తెలియజేసి వారికి ధర్మమార్గాని బోధించి వారిని వివేకము కలవానిగా, ఆత్మజ్ఞానం తెలుసుకునేలా నిరంతరం ప్రయత్నించును.
ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

No comments:

Post a Comment