బసవేశ్వరా వృషభావతారుడవై దివ్య శ్రేష్ఠుడా శ్రీ గురులింగ స్వరూపుడవైనవాడా, విశేషముతో కూడిన మిక్కిలి ప్రకాశవంతమైన కీర్తిగలవాడా, మంచి కార్యములు చేయుటఅనే విద్యయందు పరిపూర్ణుడవైనవాడా, పునర్జన్మలేకుండా చేయువాడా, పోగొట్టబడిన అభ్యాగతులయొక్కయు, ఆశ్రితులయొక్కయు, ఆపదలుగలవాడా, కవులకు, పండితులకు, గాయకులకు చక్రవర్తియై వెలుగొందేవాడా, మా అందరికీ నీవే దిక్కు.
శ్రీగురులింగమూర్తి! సువిశేష మహోజ్జ్వలకీర్తి! సత్క్రియో
ద్యోగ కళాప్రపూర్తి! యవధూత పునర్భవజార్తి! పాలితా
భ్యాగత సంశ్రితార్ధి కవిపండితగాయక చక్రవర్తి! దే
వా! గతి నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
No comments:
Post a Comment