Saturday, November 19, 2016

ధర్మమే జయం ధర్మో రక్షతి రక్షిత:

అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు శ్రీవారు కొలువైన దివ్య తిరుమల క్షేత్రం ఉన్నది మన రాష్ట్రములోనే.ఒక పిలుపులో పిలిచితే పలికేటి ఆది దేవునికి తల్లి అయిన వకుళ మాతను మనం తిరుమలలో శ్రీవారి దర్శనం కాగానే అద్దాలలో ఉంచిన వకుళ మాత విగ్రహం బంగారు భావికి సమీపాన ఉన్న ఆలయములో దర్శనం చేసుకుంటాము. వకుళ మాతయే శ్రీ వారి పోటు కి సర్వాధికారిణి. వకుళ మాత స్వయంగా స్వామి వారికి ఆరోజుల్లో  వెన్నముద్దలు తినిపించేదిట ఈ వకుళ మాత ఎవరో కాదు.. కృష్ణావతరములో కృష్ణయ్యను అత్యంత ప్రేమతో మమతానురాగాలతో పెంచి పోషించిన యశోధయే.ఆమె మరుజన్మలో వకుళాదేవిగా జన్మించిందని ఐతిహ్యం. కృష్ణావతారములో నల్లనయ్యకు వివాహాలు ఎన్నిజరిగినా ఆమె ఒక్కటీ చూడకుండానే జబ్బుపడి పోవడముతో భగవానుడు ఆమెను అనుగ్రహించి ఇచ్చిన వరం..ఆ తరువాత జన్మలో ఆమె శ్రీనివాసుని కళ్యాణాన్ని దగ్గరుండి ఆకాశరాజుతో మంతనాలు జరిపి  శుకమహర్షి వంటి వేదజ్ఞుల సహకారముతో ఆమె వెంకన్న వివాహం పద్మవతీ దేవితో  జరిపించింది. తిరుపతికి సమీపాన పేరూరులో వకుళ మాతకు పురాతన ఆలయం ఉంది. అక్కడ ఒకప్పుడు నిత్య పూజ ధూప దీపాలతో అలరారింది. కానీ కొన్నేళ్ళ తరువాత  ఎవరికీ పట్టక శిథిలావస్థకు చేరుకుంది. ఒకప్పుడు తిరుమలలో జరిగినట్టే ఇక్కడ  ఉత్సవాలు, వేడుకలతో  వకుళ మాత ఆలయం విరాజిల్లేదిట. ఇక్కడ వకుళాదేవి గుడిలో గంటానాదం విన్నాకే అక్కడ తిరుమలలో శ్రీనివాసునికి నైవేద్యం.  అనేక వందల ఏళ్లనాటి వకుళ మాత ఆలయంలో ఓ పెద్ద గంట ఉండేదని ప్రతీతి. నిత్యం ఇక్కడి గంటానాదం విన్న తరువాతే తిరుమలలో వెలసిన శ్రీనివాసునికి నైవేద్యం పెట్టేవారన్నది  స్వామి వారి భక్తుల గాడ విశ్వాసం. పేరూరు సమీప గ్రామాల ప్రజలు కూడా వకుళమాత ఆలయం నుంచి గంటారావం  విన్నాకే భోజనాలు చేసేవారని ప్రతీతి. అంతటి మహోన్నత చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అప్పట్లో టిప్పుసుల్తాన్‌ తండ్రి హైదర్‌ ఆలీ కుళమాత ఆలయాన్ని ధ్వంసం చేయడముతో బాటు, అందులోని వకుళమాత విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేశారు. అప్పటి నుంచి ఈ ఆలయంలో వకుళ మాత విగ్రహం ఏర్పాటు చేయలేదు. దీంతో దేవత లేని గుడిగా,  ఇలా  శిథిలావస్థకు చేరుకుంది.అసలే ఆనాటి చారిత్రక ఆలయం.. ఆపై ముష్కరుల దాడుల వల్ల పూర్తిగా శిథిల దశకు చేరుకుంది. ఇంకేముంది ఆ తరువాత గుప్తనిధుల వేటగాళ్ల కన్నూ ఈ వకుళమాత ఆలయంపై పడింది .ఆనాటి రాజుల కాలంలో ఇక్కడ భారీగా నిధులు ఉంచి వుంటారన్న నమ్మకంతో.. వకుళమాత ఆలయాన్ని మరింతగా నాశనం చేసేశారు. ఇంక తరువాతి రోజుల్లో  అకక్ద వుండే విలౌవైన గ్రానైట్రాయి కోసం మైనింగ్ మాఫియా జరిపిన తవ్వకాల వల్ల ఆలయం మరింత శిథిలావస్థకు చేరుకుంది .ఆలయ పరిసరాలపై కన్నేసిన మైనింగ్‌ వ్యాపారులు అక్కడ ఉండే  గ్రానైట్‌ను పెద్ద ఎత్తున తవ్వేశారు. కిలోమీటరు వరకు విస్తరించి ఉన్న ఈ రాతికొండను పిండిగొట్టి అనేక కోట్లరూపాయలు కొల్లగొట్టారు. రాతిని పగులకొట్టడానికి శక్తిమంతమైన బాంబులను వినియోగించడంతో వకుళామాత ఆలయమూ ప్రమాదంలో పడింది. మహమ్మదీయుల పాలన నుంచి మొదలైన వకుళమాత ఆలయ విధ్వంసం, నేటికీ కొనసాగుతూనే ఉంది.కలియుగ ప్రత్యక్ష దైవం అయిన  శ్రీనివాసుని భక్తులను వకుళమాత ఆలయ దుస్థితి చుస్తే  అమితంగా స్వామి వారి భక్తులను బాధపడేట్టు చేస్తుంది . అయితే ఇన్నాళ్లకు శ్రీపీఠం వ్యవస్థాపకులు శ్రీ పరిపూర్ణానంద స్వామి యొక్క చొరవ వల్ల,  గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారు ,  భారతీయ జనతాపార్టీ కార్యకర్తల పోరాటం వల్ల చివరకు హైకోర్టు వకుళమాత ఆలయాన్ని పునరుద్ధరించాలని తీర్పునివ్వడం ముదావహం.

ధర్మమే జయం.. ధర్మో రక్షతి రక్షిత:

No comments:

Post a Comment